నగరానికి 540 అద్దె బస్సులు
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో 560 వరకు విద్యుత్ బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం ఆ దిశగా ముందుకు సాగడం లేదు.
- మొదటి విడతలో 340 డీజిల్ బస్సులకు టెండర్లు
- జనవరి 3 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం.?
- త్వరలోనే మరో 200 బస్సులకు కూడా..
సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో 560 వరకు విద్యుత్ బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం ఆ దిశగా ముందుకు సాగడం లేదు. ఎప్పటి వరకు విద్యుత్ బస్సులు ఏర్పాటు చేస్తారనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. ఒక పక్క మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు సరిఫడా బస్సులు లేకపోవడంతో 2010కి ముందు కొనుగోలు చేసిన డీజిల్ బస్సులను నడుపుతున్నారు. అదేవిధంగా విద్యుత్ బస్సులు కొనుగోలు చేయడానికి బదులుగా వాటి స్థానంలో 340 డీజిల్ బస్సులు (బీహెచ్-4) అద్దె ప్రాతిపదికన కొనుగోలు చేసే కార్యక్రమానికి ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ నెల 15న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి 22 నుంచి ఆన్లైన్ టెండర్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. జనవరి 3వరకు గడువు విధించడంతో పాటు అదే రోజు టెండర్లు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నట్లు టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గురువారం జేబీఎస్లోని రెండో అంతస్థులో అద్దె బస్సుల ప్రీ బిడ్డింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే మరో 200 డీజిల్ బస్సులకు కూడా టెండర్లు పిలువబోతున్నారు. అందుకోసం సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

