Ganesh Chaturthi | సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ) : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది 5 లక్షల మట్టి విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీ శాఖలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. మట్టి గణపతులనే పూజిద్దామంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ వంతు బాధ్యతగా ఉచితంగా 8 అంగుళాల పొడవుతో కూడిన మట్టి విగ్రహాలను అందించాలని నిర్ణయించారు.
ఈ మేరకు 8 ఇంచులు, ఒక అడుగు, 1.5 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాల తయారీకి టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తును పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా ఆ ప్రక్రియను పూర్తి చేసి.. వచ్చే నెల మొదటి వారంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.