Drunken Drive | హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారాల్లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 457 మంది మందుబాబులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో టూ వీలర్ డ్రైవర్లు 377 మంది, త్రీ వీలర్ డ్రైవర్లు 27 మంది, ఫోర్ వీలర్ డ్రైవర్లు 53 మంది ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. 468 మందిని అరెస్టు చేశారు. టూ వీలర్స్ డ్రైవర్లు 335 మంది, త్రీ వీలర్ డ్రైవర్లు 25, ఫోర్ వీలర్ డ్రైవర్లు 107 మంది, హెవీ వెహికల్ డ్రైవర్ ఒకరు అరెస్టు అయినట్లు పోలీసులు తెలిపారు.