సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 40 డిగ్రీలు దాటి నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సోమవారం నాటికి కొంత చల్లబడ్డాయి.
ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా 36.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.3 డిగ్రీలు, గాలిలో తేమ 35శాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు కొంత తగ్గడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.