బడంగ్‌పేట, సెప్టెంబర్ 10: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి సబ్బండ వర్గాల ప్రజలు చేరుతున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో 300 మంది ఆదివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, సీనియర్ నాయకులు బిమిడి జంగారెడ్డి, కార్పొరేటర్లు అర్జున్, శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిష్యత్
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ మైనార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, యూత్ ఉపాధ్యక్షుడు హుస్సేనీ, 24వ వార్డు కాంటెస్టెడ్ కౌన్సిలర్ బాదర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
ఇటీవల జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేశారన్నారు. బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి వేలాది మంది బీఆర్ఎస్లోకి చేరుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు, యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. అభివృద్థిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఉబేద్, జుబేర్, సాజిద్ ఖాన్, సుజాహిత్ హుల్లాఖాన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.