Ganja | పెద్ద అంబర్పేట, ఫిబ్రవరి 20 : అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని విజయవాడ జాతీయ రహదారిపై గురువారం భారీగా గంజాయి పట్టుబడింది. మండల పరిధిలోని రామోజీ ఫిలిం సిటీ వద్ద అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా డీసీఎం కంటైనర్లో తరలిస్తున్న దాదాపు 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్టు తెలిసింది. పక్కా సమాచారంతోనే పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.