హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) ఓఆర్ఆర్పై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. శామీర్‌పేట-కీసర (Keesara) మధ్య ఔటర్ రింగ్‌రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో (Bolero), టాటా టియాగో కారును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు క్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు, లారీ ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రమాదంతో ఓఆర్ఆర్పై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించిన సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.