iPhones | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం రాత్రి సీఐఎస్ఎఫ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అబుదాబి నుంచి వచ్చిన ఓ ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. 3 కోట్ల విలువ చేసే ఐఫోన్లు, ఐవాచ్లతో పాటు డ్రోన్స్‌ను అధికారులు సీజ్ చేశారు. వీటన్నింటిని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు తేల్చారు.
ఐఫోన్లు, ఐవాచ్లను తరలించిన వ్యక్తులను మహ్మమద్ జహంగీర్, సీ జయరాం రాజుగా పోలీసులు గుర్తించారు. జహంగీర్ చెన్నై వాసి కాగా, జయరాం రాజు నెల్లూరు ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. 65 ఐఫోన్లు, 50 ఐవాచ్‌లు, 4 వీడియో గేమ్ కన్సోల్స్, 8 హైఎండ్ డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ కూడా అబుదాబి నుంచి ఇతిహద్ ఎయిర్వేస్ ఫ్లైట్(EY-328) లో శంషాబాద్‌కు వచ్చారు.