Hyderabad | శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.1.81 కోట్ల విలువ చేసే 2.91 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎమర్జెన్సీ లైట్లో బంగారాన్ని దాచి తీసుకొస్తుండగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడిని ఏపీలోని వైఎస్సార్ జిల్లా వాసిగా గుర్తించారు.