హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 2,865 మంది పోలీసుల బదిలీ జరిగింది. ఏఎస్ఐలు – 219, హెడ్ కానిస్టేబుళ్లు – 640, కానిస్టేబుళ్లు – 2,006 మంది బదిలీ అయ్యారు. పోలీసు సిబ్బంది బదిలీ కోసం గత ఐదేండ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. కరోనా కారణంగా కూడా రెండేండ్లుగా పోలీసుల బదిలీ ప్రక్రియ చేపట్టలేదు. మొత్తంగా ఇవాళ పోలీసు బదిలీల ప్రక్రియకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడంతో పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.