సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 స్థానికసంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిళ్లు, జోన్లు కూడా రూపాంతరం చెందాయి. మొత్తం 2025 కిలోమీటర్లు పెరిగిన విస్తీర్ణాన్ని 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60 పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వెనువెంటనే మరో జీవోలో ఆయా జోన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి, ఖైరతాబాద్‌కు ప్రియాంక అల, కుత్బుల్లాపూర్‌కు సందీప్‌కుమార్ ఝా, మల్కాజిగిరికి సంచిత గంగువార్, ఉప్పల్‌కు రాధిక గుప్తా, గోల్కొండకు ముకుందరెడ్డిని నియమించారు. పాత జోన్లకు వారినే కొనసాగించారు. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
అమీన్పూర్, మియాపూర్, నార్సింగి, పటాన్చెరు, శేరిలింగంపల్లి, అల్వాల్ కాలనీ, కూకట్పల్లి, మదాపూర్, మూసాపేట, గాజులరామారం, చింతల్, మేడ్చల్, కొంపల్లి, జీడిమెట్ల, నిజాంపేట, దిండిగల్, చార్మినార్, మలక్‌పేట, మూసారంబాగ్, సంతోష్‌నగర్, యూకుత్‌పురా, అల్వాల్, బోయిన్పల్లి, జవహర్‌నగర్, మల్కాజిగిరి, మౌలాలి, బోడుప్పల్, ఘట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, సరూర్‌నగర్, ఆదిభట్ల, బడంగ్‌పేట, జల్పల్లి, శంషాబాద్, అంబర్‌పేట, కవాడిగూడ, మెట్టుగూడ, ముషీరాబాద్, తార్నాక, గోల్కొండ, కార్వాన్, గోషామహల్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, అమీర్‌పేట, బోరబండ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, అత్తాపూర్, చంద్రాయణగుట్ట, ఫలక్‌నూమా, జంగంమెట్, రాజేంద్రనగర్, బహదూర్‌పురా.
1. శేరిలింగంపల్లి
2. కూకట్పల్లి
3. కుత్బుల్లాపూర్
4. చార్మినార్
5. మల్కాజిగిరి
6. ఉప్పల్
7. ఎల్బీ నగర్
8. శంషాబాద్
9. సికింద్రాబాద్
10. గోల్కొండ
11. ఖైరతాబాద్
12. రాజేంద్రనగర్