శామీర్‌పేట, డిసెంబర్ 7 : ఒడిశా నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని శామీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 26 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్‌బషీర్‌బాగ్ ఏసీపీ రాములు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ ధూల్‌పేట్‌కు చెందిన అనికేశ్ సింగ్ పాతనేరస్తుడు. జైలులో ఏర్పడిన పరిచయంతో రాహుల్ ద్వారా ఒడిశా నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తరలించి విక్రయించేందుకు పథకం వేశారు.
ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్రం, మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన గంజాయి స్మగ్లర్ మీనాభాయిని ఫోన్లో సంప్రదించారు. కారులో గంజాయి తీసుకుని డ్రైవర్ నయన్దాస్, గీత మందల్, గీతమిస్త్రి, బాలికతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరి శామీర్‌పేట మండలానికి వచ్చారు. ఇక్కడ అనికేశ్ సింగ్, రోహిత్, రాజ్‌సింగ్, రాహుల్‌లు బైక్‌లపై ముందు వస్తుండగా కారు వెనకాల వస్తుంది. దీనిపై సమాచారం అందుకున్న మేడ్చల్ జోన్ ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు శామీపేటలో కారును ఆపి తనిఖీ చేయగా దాదాపు రూ.13 లక్షల విలువ చేసే ఎండు గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
వెంటనే కారులో ఉన్నవారితోపాటు బైక్‌లపై ఉన్న మొత్తం ఏడుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని, కారు, రెండు బైక్‌లు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 18005996969కు సమాచారం ఇవ్వాలని ఏసీపీ కోరా రు. సమావేశంలో సీఐ శ్రీనాథ్, డీఐ గంగాధర్, ఎస్వోటీ సీఐ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఎస్ఐలు హారిక, పరశురామ్, ధశరత్, సిబ్బంది పాల్గొన్నారు.
కీసర, డిసెంబర్ 7: గంజాయి కేసులో 17మందిని కీసర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటయ్య కథనం ప్రకారం.. కీసర మండలం, భోగారంలోని హోలీమేరి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గంజాయి విక్రయిస్తున్న బిహార్‌కు చెందిన సమీర్, ఒడిశాకు చెందిన విష్ణు లను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో స్నేహితుడు ఆకుల కిశోర్ అనే వ్యక్తి ద్వారా గంజాయిని విక్రయిస్తున్నట్లు తేలింది. అలాగే అదే ప్రాంతంలో మూడుచింతలపల్లికి చెందిన సాయికుమార్, సినిగల్ల చింటూలకు గంజాయి ఇవ్వడానికి సమీర్ కుమార్సిన్హా, ఆకుల కిశోర్‌లు వచ్చారు.
పోలీసులు వారినీ పట్టుకున్నారు. వారి నుంచి 1కిలో 90గ్రాముల గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. విచారణలో కీసరకు చెందిన ముద్దం సుందర్, అమ్ముల కల్యాణ్, గుంజా రాజేశ్, వేముల ప్రభు, ముద్దంగల సురేశ్, దండుగుల రాజేశ్, నర్సంపల్లికి చెందిన బండారు సాయికుమార్, తిమ్మాయిపల్లికి చెందిన వినయ్, తోకటి పరమేశ్, బాలు, భోగారంకు చెందిన పోగో సేమ్లను కూడా అరెస్టు చేశారు. ఈ గంజాయి కేసులో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులను కోర్టుకు రిమాండ్ చేశామని, ఇంకా 14మంది వ్యక్తులను అరెస్టు చేశామని సీఐ వెంకటయ్య తెలిపారు.