గతేడాది 2500 అగ్ని ప్రమాదాలు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఒక్క నగరంలోనే 2500 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఒక్క నగరంలోనే 2500 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు.
అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారుగా 450 వరకు ప్రమాదాలు జరిగినట్లుగా తమ వద్ద నమోదయ్యాయని, ఇందులో ఎక్కువగా షార్ట్ సర్క్యూట్‌తోనే జరిగినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగిన ఘటన గుల్జార్‌హౌస్‌లో ఆదివారం జరిగిన ప్రమాదమేనని పేర్కొన్నారు.
మూడేండ్లలో జరిగిన అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే..
- ఆదివారం గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారు.
- ఫిబ్రవరిలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాగూడలోని పాషాకాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఒక చిన్నారితో సహా ముగ్గురు మృతిచెందారు.
- గత సంవత్సరం అక్టోబర్ లో యాకుత్‌పురలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. మరో పదిహేనేళ్ల బాలిక గాయపడింది.
- గత సంవత్సరం జూలైలో జియాగూడ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో
10 ఏళ్ల బాలిక మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. - నవంబర్ 2023లో నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది మరణించగా, 12 మంది గాయపడ్డారు.
- మార్చి 2023లో సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు.
- జనవరి 2023లో సికింద్రాబాద్ మినిస్టర్స్రోడ్లోని నల్లగుట్ట వద్ద ఓ క్లాత్స్టోర్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు సజీవదహనమయ్యారు.
- సెప్టెంబర్ 2022లో సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు ఆఫీసు సమీపంలో ఓ బహుళ అంతస్తుల కాంప్లెక్స్‌లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
- మార్చి 2022లో సికింద్రాబాద్‌లోని ఓ స్కాప్ గిడ్డంగిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బీహార్‌కు చెందిన పదకొండు మంది వలస కార్మికులు సజీవదహనమయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fire
- fire accidents
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

