నమస్తే తెలంగాణ, సిటీ నెట్వర్క్ ;ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతల కష్టాలు వర్ణనాతీతం. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ చీకట్లు తప్పవు. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కరెంటు కోతలతో బెంగుళూరు బెంబేలెత్తుతున్నది. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ వెలుగులు జిగేల్మంటున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో చీకటి రోజులు పోయాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సరికొత్త వెలుగులు వచ్చాయి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రైతులకు 3గంటల కరెంట్ చాలని ప్రకటించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు కొనితెచ్చుకున్నట్లే అని సామాన్యులు భయపడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ సర్కారు కొలువుదీరాలని, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కరెంటుతో కష్టాలు తీరాయి
నేను 12 సంవత్సరాలుగా టైలర్‌గా పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కరెంట్ కష్టాలు ఎపుడు తీరుతాయా అని ఎదురుచూసేవాళ్లం. సీఎం కేసీఆర్ పుణ్యమాని నిరంతర విద్యుత్ సరఫరాతో మా కష్టాలు తీరాయి. 24 గంటల కరెంట్ ఉండడంతో వ్యాపారాలు చాలా మెరుగయ్యాయి. నేడు కుట్టుమిషన్లన్నీ కరెంట్‌తోనే నడుస్తున్నాయి. కొత్తగా కంప్యూటర్ ఆధారిత ఎంబ్రాయిడరీ మిషన్లు వచ్చాయి. కస్టమర్లకు నచ్చిన తరహాలో సరికొత్త డిజైన్లతో దుస్తులు కుట్టిస్తున్నాం.
– సుమలత, బ్రాహ్మణీ బోటిక్, కొండాపూర్
సీఎం కేసీఆర్ గ్రేట్
తెలంగాణ ఏర్పాటుకు ముందు రోజుకు 4-5 గంటలు కరెంటు కోతలు ఉండేది. దీంతో మా థియేటర్లో జనరేటర్ డీజిల్ ఖర్చు నెలకు రూ.1.20 లక్షలు ఉండేది. తెలంగాణ వచ్చాక పవర్ కట్ అనేదే లేదు. మాకు డీజిల్ ఖర్చు తప్పింది. జనరేటర్ ఉపయోగించడమే లేదు. తొమ్మిదేండ్లుగా మేమే కాకుండా చిన్న పరిశ్రమల యజమానులు, లేబర్ కూడా సంతోషంగా ఉంది. కరెంటు ఉంటేనే అన్ని వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఈ విషయంలో సీఎం కేసీఆర్ గ్రేట్.
– ఎర్రబోలు నర్సింహారెడ్డి,మేనేజర్, అంబర్‌పేట శ్రీరమణ థియేటర్
సర్కారును కాపాడుకోవాలె
తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు ఎపుడు వస్తదో తెలవదు. కరెంటు సరిగా లేక.. మిషిన్ నడవక కుటుంబ పోషణకు నానాయాతన పడ్డం. రాష్ట్ర వచ్చాక కరెంటు కోతలు ఎరకలే. దీంతో పిండి గిర్ని కొనుక్కున్న. బ్రహ్మాండంగా మిషన్ నడుపుకుంటున్న. అప్పులు తీర్సుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న. కోతలు లేని నాణ్యమైన కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం మాలాంటి పేదలకు ఉపాధి భరోసానిచ్చింది. ఇలాంటి సర్కారును కాపాడుకోవాలె.
– ఎడ్ల విజయ, చిరు వ్యాపారి
కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది
కాంగ్రెస్ హయాంలో నిత్యం కరంటు కోతలే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కరంటు కోతల్లేవు. మా గార్మెంట్స్ దుకాణంలో అప్పుడు సగం పని కూడా కాకపోయేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పని పెరిగింది. సంపాదన కూడా పెరిగింది. మేము ఇంత బాగా కరంటు ఇస్తారని అనుకోలేదు. కేసీఆర్‌కు నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్స్. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుంది.రావాలి కూడా.
– కవిత, సికింద్రాబాద్
కేసీఆర్‌తోనే 24గంటల కరెంటు
తెలంగాణ రాక ముందు పని ముంగిట పెట్టుకొని కరెంట్ కోసం ఎదురు చూసేవాళ్లం. సీఎం కేసీఆర్ వచ్చినంక పరిస్థితులు మారాయి. అప్పుడు నాకు ఒక్కడికే పని సరిపోయేది కాదు. ఇప్పుడు నా కింద నలుగురైదుగురు పని చేసున్నారు. బాగా వ్యాపారం చేసుకొని, మంచిగా బతుకుతున్నాం. కేసీఆర్ సీఎంగా లేకుంటే 24 గంటల కరెంట్ వచ్చేది కాదు..సచ్చేది కాదు. కంపెనీలకే కాకుండా ఇండ్లకు 24 గంటలకు కరెంట్ ఇవ్వడంతో పిల్లలు చదువుకు కూడా ఇబ్బందులు తప్పాయి. ఎన్నో మంచి పనులు చేస్తున్న కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉన్నది.
– నరేశ్, రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ
సీఎం కేసీఆర్ మళ్లీ రావాలి
గతంలో మంగళి షాపులో కరెంట్ లేక టార్చ్ లైట్లు వేసుకుని కటింగ్ చేసే వాళ్లం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరంటు పోతలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయీ బ్రాహ్మణుల షాపులకు ఉచితంగా కరంటు ఇస్తున్నారు. ఇప్పుడు మేము పని చేసుకుంటే డబ్బులు మిగులుతున్నాయి. మా నాయీ బ్రాహ్మణులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ రావాలని
కోరుకుంటున్నారు.
– శీను, రామంతాపూర్, అరవింద్‌నగర్
ప్రభుత్వానికి అండగా నిలువాలి
పక్క రాష్ర్టాలలో కరెంటు సరఫరా సరిగా లేక అక్కడ ప్రజలు, చిన్న మధ్య తరగతి నాలాంటి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతి రోజు పత్రికలు, టీవీలలో చూస్తున్నాం. ఆ రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో మేమెంతో అదృష్టవంతులం. నిమిషమైన కరెంటు కోతలు చూడలేదు. కరెంటును నమ్ముకుని ఉపాధి బ్రహ్మాండంగా నడుస్తుండటంతో సంతోషంగా ఉన్నాం. ఇది నిజంగా సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ సమర్థతే. వాస్తవం కండ్ల ముందు కనబడుతుంటే …. దానిని గుర్తించి మాలాంటి వాళ్ల కోసం పని చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలువాలి.
– కృష్ణ గౌడ్, చిరు వ్యాపారి
ఇండ్లు కట్టుకున్నాం..బండ్లు కొనుక్కున్నాం
కరెంటు సక్కగా ఉండని ఆ రోజులను తలుచుకుంటే బాధలు తన్నుకొస్తాయి. ఆర్డర్ వచ్చినా పనికాకపోవడంతో కస్టమర్లతో తిట్లు పడాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చినంక మా బతుకులు మారాయి. చేతి నిండా పని ఉంటుంది. ఇట్లా ఆర్డర్ వస్తే అట్ల పని పూర్తి చేస్తున్నాం. ఇండ్లు కట్టుకొని, బండ్లు కొనుక్కొని మంచిగ బతుకుతున్నాం. 24 గంటల కరెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ మా పాలిట నిజంగా దేవుడే. ఆయనే మళ్లీ సీఎం కావాలి.
– మారోజు రమేష్‌బాబు చారి,అంబేద్కర్‌నగర్, జవహర్‌నగర్