మంగళవారం 09 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 04:09:45

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి

  • మెరుగైన సేవలందించేందుకు సహకరించుకోవాలి
  • అధికారులతో సమీక్షా సమావేశంలో జోనల్‌ కమిషనర్‌ 

సికింద్రాబాద్‌, జనవరి 27: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. జోనల్‌ పరిధిలోని పలు శాఖల అధికారులతో బుధవారం జోనల్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి, చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులు  త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనేకచోట్ల జలమండలికి చెందిన డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటివల్ల రోడ్ల నిర్మాణం ఆలస్యం అవుతోందని అన్నారు. రోడ్‌ కటింగ్‌లు జరిపే సమయంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు. సమాచారం ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలను పక్కకు జరపాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు. షీ, బీఓటీ, పీఎఫ్‌టీ టాయిలెట్ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ సిటీప్లానర్‌ ప్రసాద్‌రావు, సికింద్రాబాద్‌ జోన్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ అనిల్‌రాజ్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, మల్కాజ్‌గిరి, బేగంపేట్‌, అంబర్‌పేట్‌ డిప్యూటీ కమిషనర్లు పీ మోహన్‌రెడ్డి, హరికృష్ణ, ముకుందారెడ్డి, వేణుగోపాల్‌, జోన్‌కు చెందిన ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు,  జలమండలి మారేడ్‌పల్లి జీఎం రమణారెడ్డి, ట్రాన్స్‌కో ఏడీఈ, ట్రాఫిక్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు. 


VIDEOS

logo