మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 26, 2021 , 04:26:13

లోఫ్రెషర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

లోఫ్రెషర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

అంబర్‌పేట, జనవరి 25 : నల్లకుంట డివిజన్‌, ఓల్డ్‌ నల్లకుంట వివేకానందస్వామి విగ్రహం పక్కలేన్‌లో రూ.6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పైపులైన్‌ పనులను డివిజన్‌ కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవిరమేశ్‌తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ సోమవారం ప్రారంభించారు.  కొంత కాలంగా ఈ ప్రాంతంలో మంచినీరు లోఫ్రెషర్‌తో వస్తుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రూ. ఆరు లక్షలతో కొత్త పైపులైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పైపులైన్‌ పనులు పూర్తయితే బస్తీవాసులకు మంచినీటి లోఫ్రెషర్‌ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు. అలాగే మొరంక్వారీ బస్తీలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేయనున్న నూతన డ్రైనేజీ పైపులైన్‌ పనులను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo