గురువారం 25 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 24, 2021 , 04:25:38

త్వరలో అలీకేఫ్‌ జంక్షన్‌ సుందరీకరణ

త్వరలో అలీకేఫ్‌ జంక్షన్‌ సుందరీకరణ

గోల్నాక, జనవరి 23 : అంబర్‌పేట అలీకేఫ్‌ జంక్షన్‌ రూపు రేఖలు మార్చేందుకు త్వరలో సుందరీకరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వరరావు, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ ప్రసాద్‌,  తాసీల్దార్‌ వేణుగోపాల్‌, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక నూతన కార్పొరేటర్‌ విజయ్‌కుమార్‌గౌడ్‌ తదితరులతో కలిసి ఆయన అంబర్‌పేట అలీకేఫ్‌ చౌరస్తాతో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు, జీహెచ్‌ఎంసీ వివిధ ట్రాఫిక్‌ జంక్షన్ల సుందరీకరణ పనులు చేపట్టిందని అన్నారు.  ఈ కార్యక్రమంలో డీఎంసీ వేణుగోపాల్‌,  ఏఎంహెచ్‌వో హేమలత, ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌, డీఈ సుధాకర్‌, ఈఈ ఆశాలత, ఏఈ వినీల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo