మంగళవారం 26 మే 2020
Hyderabad - May 04, 2020 , 01:14:08

కబ్జాకు యత్నం..

కబ్జాకు యత్నం..

హఫీజ్‌పేట్‌ :  చందానగర్‌ సర్కిల్‌-21 పరిధిలోని మదీనగూడ సర్వేనంబర్‌ 69/1 ప్రభుత్వ స్థలంలో కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులు శనివారం అర్ధరాత్రి రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు శేరిలింగంపల్లి ఆర్‌ఐ చంద్రారెడ్డికి తెలుపగా  ఆదివారం  ఆయన  నిబంధనలకు విరుద్ధంగా వేసిన రోడ్డును జేసీబీ సాయంతో తొలగించారు. అదేవిధంగా  ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.  


logo