రైతును రాజు చేయడమే సీఎం ధ్యేయం
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల రూరల్, మార్చి 30: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు బంధు సమితి ఆధ్వర్యం లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం రైతుల కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సు కో సం తపిస్తున్నారని అన్నారు. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కోసం 6వేల సెంటర్లు, ధా న్యం సేకరణకు రూ.20వేల కోట్ల నగదు సమీకరణకు ఆదేశాలివ్వడం సీఎంకు రైతులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కొంత మంది రైతుల ముసుగులో ప్రతిపక్షాల ప్రోద్బలంతో ప్రభుత్వా న్ని విమర్శిస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒక్కటైనా అమలువుతుందా అని ప్రశ్నించారు. గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేయడం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్న సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం సమర్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్లు నక్కల రవీందర్‌డ్డి, జుంబర్తి శంకర్, జిల్లా సభ్యుడు దామోదర్‌రావు, జగిత్యాల, సారంగపూర్ జడ్పీటీసీ సభ్యులు సంగె పు మహేశ్, మనోహర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్, వైస్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, శీలం సురేందర్, రైతు నాయకులు చెరుకు జాన్, రాజిరెడ్డి, వెంకటి, గంగరాజం, ఆసిఫ్, ప్రభాకర్, బుచ్చిరాజం, గంగారెడ్డి, గంగాధర్, గంగమల్లు, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
జగిత్యాల రూరల్, మార్చి 30: పట్టణానికి చెందిన 18 మందికి రూ. 5,70,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు ఆనందరావు, బండారి విజయ్, రియాజ్, వొల్లం మల్లేశం, కత్తురోజు గిరి, కౌన్సిలర్లు అల్లె గంగసాగర్, తోట మల్లికార్జున్, బొడ్ల జగదీశ్, కూసరి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం
జగిత్యాల టౌన్, మార్చి 30: కరోనాతో అతలాకుతలమవుతున్నా, ఆర్థిక సంక్షోభం వెంటాడుతు న్నా తెలంగాణ సర్కార్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పక్షాన నిలిచిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం టీ ఉద్యోగ జేఏసీ జిల్లా శాఖ చైర్మన్ బోగ శశిధర్, కో చైర్మన్ ఎండీ వకీల్, గౌరవాధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీఎన్జీవో, టీ రెవెన్యూ, టీ పెన్షనర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి గూడ ప్రభాకర్‌రెడ్డి, కోశాధికారి నూగూరి సుధీర్‌కుమార్, నాగేందర్‌రెడ్డి, ఆరె రవీందర్, భువనేశ్వర్, సంధ్యాదేవి, ఇంద్రజ, కాంత, చంద్రిక, పెన్షనర్ల జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్, టీఎన్జీవో జిల్లా ప్రచార కార్యదర్శి రాంబాబు, పెన్షనర్ల కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Jagtial
- Jagtial News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


