హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి కిలో బంగారం, 7.5 కిలోల వెండి, 3 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో నకిలీ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డులు తయారు చేసే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1200 నకిలీ ఆర్సీలు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు వారిని విచారిస్తున్నారు.