Ration Cards | మలక్ పేట, మే 7: హైదరాబాద్ మలక్పేట సర్కిల్-1 పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా 18,121 దరఖాస్తులు, ప్రజావాణి ద్వారా 133 దరఖాస్తులు వచ్చినట్లు సర్కిల్-1 అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఎస్వో నర్సింగ్ రాజ్ తెలిపారు. మ్యుటేషన్ల (రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల నమోదు) కోసం 25,403 ఆర్జీలు రాగా, 19 వేల యూనిట్లు యాడ్ అయినాయని ఆయన తెలిపారు.
సర్కిల్ వన్ పరిధిలో మొత్తం 68,868 కార్డులు ఉండగా, అందులో 63,774 ఎఫ్ఎస్సీ కార్డులు, 3,889 అంత్యోదయ కార్డులు, 1205 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయని నర్సింగ్ రాజ్ తెలిపారు. మలక్ పేట నియోజకవర్గంలో 5013, యాకుత్పురా నియోజకవర్గంలో 10,897, సైదాబాద్ లో 2,211 కార్డులు ఉన్నాయని, కొత్త కార్డుల కోసం సర్కిల్ వన్ పరిధిలో 18,121 దరఖాస్తులు రాగా, 4583 ఎంక్వయిరీలు పూర్తయినవని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డులపై 35 కిలోల బియ్యం కిలో పంచదార రూ.13.50 లకు ఇవ్వబడుతుందని, అన్నపూర్ణ కార్డులపై 10 కిలోల బియ్యం, అన్ని కార్డులకు ఐదు కిలోల గోధుమలు రూ.7లకు కిలో చొప్పున ఇవ్వబడతాయని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రజా పంపిణీ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియాన్ని అమ్ముకుంటే కార్డులను రద్దు చేస్తామని ఏఎస్ఓ నర్సింగ్ రాజ్ హెచ్చరించారు.