హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 17.75 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి శంషాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల వద్ద ఈ కరెన్సీని గుర్తించి సీజ్ చేశారు. 89500 సౌదీ రియాల్స్, 2900 యూఏఈ దిర్హామ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.