హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) సైదాబాద్‌లో విషాదం చోటుచేసుకున్నది. వీడియోగేమ్ ఆడొద్దన్నందుకు 16 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్‌కు చెందిన బాలుడు ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షలకు చదువుకోకుండా సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నావని అతని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు.. బిల్డింగ్ పైకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.