Accident | రోడ్డు ప్రమాదంలో 15 ఏండ్ల బాలుడి దుర్మరణం.. బైక్ ఇచ్చిన వ్యక్తిపై కేసు
రోడ్డు ప్రమాదంలో 15 ఏండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యాకూబ్ ఖాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
Accident | బంజారాహిల్స్, మార్చి 29: రోడ్డు ప్రమాదంలో 15 ఏండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యాకూబ్ ఖాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ (15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడి ఇంటి పక్కన నివాసముంటున్న హలీముద్దీన్ ఏసీ మెకానిక్. గురువారం మధ్యాహ్నం మౌలాలిలో ఏసీ రిపేర్ కోసం హలీముద్దీన్ బయలుదేరుతున్న సమయంలో.. తనతో పాటు బైక్‌పై ఇమ్రాన్ ఖాన్‌ను కూడా తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత.. హలీముద్దీన్ తన బైక్‌ను ఇమ్రాన్‌కు ఇచ్చాడు.
బంజారాహిల్స్ రోడ్ నం. 1లో వెనుక నుంచి వచ్చిన ఓ బైక్.. ఇమ్రాన్ నడిపిస్తున్న బైక్‌ను ఓవర్టేక్ చేయడంతో ఆందోళనకు గురైన ఇమ్రాన్ బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపిస్తున్న ఇమ్రాన్‌కు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని మహావీర్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మైనర్ అయిన తన కొడుకుకు బైక్ ఇచ్చి ప్రమాదానికి కారణమైన హలీముద్దీన్పై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

