Musi River | సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : మూసీ వెంబడి నిర్మాణాలు, కబ్జాలను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన సోషియో ఎకానమిక్ సర్వే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట మొదలైన ఈ సర్వే ద్వారా 56 కిలోమీటర్లు పొడువునా.. మూసీకి ఇరువైపులా నిర్మాణాలను గుర్తించనున్నారు.
తొలి దశలోనే గుర్తించిన సర్వే ఆధారంగా 12వేలకు పైగా నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించగా… గడిచిన నెల రోజుల వ్యవధిలో వీటి సంఖ్య 13వేలకు పైగా దాటినట్లు తేలింది. మరో 20 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి కానున్నది. ఈ తర్వాతే సమగ్రమైన గణాంకాలను వెల్లడించిన తర్వాత, పరిహారం వంటి అంశాలపై స్పష్టత వస్తుందని ఎంఆర్డీసీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.