సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటు దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ‘భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం..’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతకు అరుదైన గౌరవం అందించేలా సచివాలయానికి అంబేద్కర్ పేరును నామకరణం చేయడం.. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించడం అభినందనీయమన్నారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు గంధం రాములు, ఎంబీసీ సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు కోలా శ్రీనివాస్, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని, డాక్టర్ బానోత్ సంజీవ్ నాయక్, డాక్టర్ రవీందర్ నాయక్, జగ్జీవన్, అంబేద్కర్ జయంత్యుత్సవాల చైర్మన్ రాజలింగం, అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, రామకృష్ణ, తెలంగాణ ఉప్పెర సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పెర శేఖర్ సాగర్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కట్ట రవికుమార్ గుప్త, పి.వై. రమేశ్, డాక్టర్ రవీందర్, పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షుడు చింతకింది అనురాధ, టీపీఎస్ మహిళా నాయకురాలు గుంటి మంజుల, మేఘన, మంజుల, భాగ్యలక్ష్మి, కవిత, లావణ్య, దూదేకుల సంఘం సుఖుల్, తదితరులు పాల్గొన్నారు.