హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో 116 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీపీ మహేశ్ భగవత్ కలిసి ప్రారంభించారు. బాలాపూర్ పీఎస్‌లో ఆధునీకరించిన పురుషులు, స్త్రీల విశ్రాంత గదులు, డైనింగ్ ఏరియా, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం గార్డెన్ ఏరియాలో మొక్కలు నాటారు. బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ రాయల్ కాలనీ, బిస్మిల్లా కాలనీ, సాయి హోమ్స్, సదత్ నగర్, జామ్ జామ్ ఏరియాల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుకు రూ. 43,35,634 ఖర్చు అయ్యాయి.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒక సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని పేర్కొన్నారు. 24 గంటల పాటు కెమెరాలు పని చేస్తూనే ఉంటాయన్నారు. రాచకొండ పరిధిలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలందరినీ సన్మానించారు.