పాతనోట్ల మార్పిడి కేసులో 11 మంది దోషులు!
పెద్దనోట్ల రద్దు డీమానిటైజేషన్ సమయంలో జరిగిన భారీ అక్రమాల కేసులో సికింద్రాబాద్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 2017లో పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన 17 మంది ముఠాపై బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పాతనోట్లను మార్చేందుకు అక్రమంగా రూ.1.20 కోట్ల విలువైన కరెన్సీని బదిలీ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి చార్జీషీట్ దాఖలు చేశారు.
- ప్రధాన నిందితుడికి జైలు, భారీ జరిమానా
సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): పెద్దనోట్ల రద్దు డీమానిటైజేషన్ సమయంలో జరిగిన భారీ అక్రమాల కేసులో సికింద్రాబాద్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 2017లో పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన 17 మంది ముఠాపై బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పాతనోట్లను మార్చేందుకు అక్రమంగా రూ.1.20 కోట్ల విలువైన కరెన్సీని బదిలీ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి చార్జీషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం మొత్తం 11 మందిని దోషులుగా తేల్చింది. ఈ తీర్పులో ప్రధాన నిందితుడైన యాదగిరికి కోర్టు రూ.4.5కోట్ల భారీ జరిమానాతో పాటు మూడున్నర ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఈ కేసులో ప్రమేయమున్న మిగతా పదిమంది దోషులకు రూ.60వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

