తెల్ల రేషన్ కార్డు లేక..గృహజ్యోతికి దూరం
రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకమైన గృహ జ్యోతిని అమలు చేస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు, తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్‌కార్డు లింకున్న వారిని నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది.
- గ్రేటర్లో గృహజ్యోతి లబ్ధిదారులు 10.93 లక్షలు
- ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు 19.85 లక్షలు
- తెల్లరేషన్ కార్డులు లేక అర్హత దక్కని వినియోగదారులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకమైన గృహ జ్యోతిని అమలు చేస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు, తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్‌కార్డు లింకున్న వారిని నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు జోన్లు హైదరాబాద్ మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్లు ఉండగా, అందులో మొత్తం 9 సర్కిళ్లు ఉన్నాయి. ఆయా సర్కిళ్లలో ప్రాథమికంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ నెల మొదటి వారం నుంచి 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారిని గుర్తిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 27నాటికి మొత్తం 10,93,228 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. కాగా ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం గ్రేటర్ పరిధిలో 19.85లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. గృహజ్యోతి పథకం కింద గుర్తించిన విద్యుత్ వినియోగదారులకు మార్చి నెల నుంచి జీరో బిల్లును విద్యుత్ శాఖ జారీ చేయనుంది. డిస్కమ్‌లు మార్చి 20వ తేదీలోపు ప్రభుత్వానికి సబ్సిడీ వివరాలను అందించాల్సి ఉంటుంది. వాటిని ప్రభుత్వం నేరుగా డిస్కమ్‌లకు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోనివారు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో, మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

