ఉప్పల్ భగాయత్.. జిల్ జిల్.. జిగేల్
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికప్రాధాన్యతనిస్తున్నది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రో స్టేషన్ ఇరువైపులా సుమారు 430కి పైగా ఎకరాల్లో మూసీ వెంబడి హెచ్ఎండీఏ భారీ లేఅవుట్ను అభివృద్ధి చేసింది.
- లేఅవుట్లో అత్యాధునిక ఎల్ఈడీ విద్యుత్ దీపాలు
- 1.42 కోట్లతో ఏర్పాటుకు హెచ్ఎండీఏ ప్రతిపాదన
సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికప్రాధాన్యతనిస్తున్నది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రో స్టేషన్ ఇరువైపులా సుమారు 430కి పైగా ఎకరాల్లో మూసీ వెంబడి హెచ్ఎండీఏ భారీ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే అత్యంత విశాలమైన 150, 120, 80, 60 ఫీట్ల వెడల్పుతో కూడిన రోడ్లను, మూసీ వెంబడి తీరం ప్రాంతంలో 3 కి.మీ పొడవైన పార్కును అభివృద్ధి చేసింది.
నివాసాలకు అత్యంత అనువుగా ఉండటంతో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణంతో పాటు అపార్టుమెంట్లు, భారీ బహుళ అంతస్థుల భవనాలు ఏర్పాటు కాగా.., మరిన్ని పురోగతిలో ఉన్నాయి. తాజాగా స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో అత్యాధునిక విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం సుమారు రూ.1.42 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. విద్యుద్దీపాల ఏర్పాటును వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు ఇటీవల టెండర్లు సైతం పిలిచారు. నెల రోజుల వ్యవధిలోనే ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో అవసరమైన ఎల్ఈడీ లైట్లను, కేబుల్స్ను మార్చివేయనున్నామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

