బంజారాహిల్స్, జనవరి 17: షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న డ్యూక్ ఎవెన్యూ బిల్డింగ్‌లోని 2వ ఫ్లోర్లో ఆకాష్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఓ సంస్థ కొనసాగుతున్నది. అదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి ఫ్లోర్లో రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్ ఉన్నది. కాగా, శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఆకాష్ ఇనిస్టిట్యూట్ భవనంలో మంటలు చెలరేగినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన కార్పొరేట్ ఆఫీసు సిబ్బంది బ్రాంచి మేనేజర్ శ్రీధర్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న శ్రీధర్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే ఆఫీసులో ఉన్న ఏసీలు, ల్యాప్టాప్స్, ప్రింటర్స్, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. శ్రీధర్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.