సిటీబ్యూరో, అక్టోబరు 24 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోరులో కీలక ఘట్టం శుక్రవారంతో ముగిసింది. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయగా 58 మంది బరిలో నిలిచారు. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఈ మేరకు పార్టీల తరపున స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపారు.
ఎన్నికలకు మరో 18 రోజుల సమయం మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. గల్లీలు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో అభ్యర్థులు ప్రచారం జోరందుకున్నది. బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నది.