ఎల్బీనగర్ జోన్‌బృందం, జూన్ 16: సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రతి డివిజన్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ పరిధి జడ్జెస్కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని శుక్రవారం స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు కార్యాలయాల్లో పదకొండు విభాగాలకు చెందిన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. వార్డు కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను స్వీకరించేందుకు రిసెప్షనిస్టుతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. దోమల బెడదను నివారించే ఎంటమాలజీ సిబ్బంది, అర్బన్ బయోడైవర్సిటీ, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, శానిటేషన్ విభాగం, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరింపజేస్తారని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీదివాకర్, డిప్యూటీ సిటీప్లానర్ సుష్మిత, ఏఎంసీ దినేశ్‌సింగ్, బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, నాయకులు పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, దుర్గెంపూడి సాంబిరెడ్డి, జక్కిడి రఘువీర్‌రెడ్డి, అనంతుల రాజిరెడ్డి, పోచబోయిన జగదీశ్‌యాదవ్, టంగుటూరి నాగరాజు, కొసనం వెంకట్‌రెడ్డి, రుద్ర యాదగిరి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, నర్రి వెంకన్న కురుమ, మార్గం రాజేశ్, చీర్క నర్సిరెడ్డి, కరణం శ్రీకాంత్, సయ్యద్ జానీ, నాంపల్లి రామేశ్వర్, గంగదాసు కృష్ణారెడ్డి, జేజే రెడ్డి, ఏలుకొండ రాంకోటి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి : ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం
నాగోల్ డివిజన్ పరిధి లలితానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలసి ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కురుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వార్డు కార్యాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం వినోద్‌కుమార్, ఏఎంసీ సుధాకర్, ఏఈ చంద్రశేఖర్, నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్, వస్పరి శంకర్, పల్లె సీతరాములు, కట్ట ఈశ్వరయ్య, సతీశ్‌యాదవ్, మైసయ్య, చెరుకు ప్రవీణ్‌గౌడ్, గణేశ్ గౌడ్, శరత్‌రెడ్డి, చంద్రశేఖర్ ఆజాద్, శ్రీధర్‌గౌడ్, అభి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల వద్దకే పాలన
వార్డు కార్యాలయాల ఏర్పాటుతో ప్రజల వద్దకే పాలన వచ్చేసిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని మూడుగుళ్ల సమీపంలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఉప కమిషనర్ సురేందర్‌రెడ్డి, పలు విభాగాల అధికారులతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు గజ్జల మధుసూదన్‌రెడ్డి, నల్ల రఘుమారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శాగ రోజారెడ్డి, ఎల్బీనగర్ యూత్వింగ్ అధ్యక్షుడు ముద్ద కళ్యాణ్ చక్రవర్తి బీఆర్ఎస్ స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలకు చేరువలో : ఎమ్మెల్సీ దయానంద్
ప్రజలకు చేరువలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శుక్రవారం కొత్తపేట నూతన వార్డు కార్యాలయాన్ని కార్పొరేటర్ పవన్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్సీ దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుధ్య విభాగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, మాజీ కార్పొరేటర్లు జీవీ సాగర్‌రెడ్డి, వజీర్ ప్రకాశ్‌గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్, బొగ్గారపు వరుణ్‌చంద్ర, తాళ్ల శ్రీశైలం గౌడ్, బాబు, వార్డు కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలి
రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. వనస్థలిపురం డివిజన్ ఎఫ్‌సీఐ కాలనీలో ఏర్పాటు చేసిన నూతన వార్డు కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రాంరభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా మన హైదరాబాద్ నిలుస్తోందన్నారు. దేశంలో ఉన్న ఎన్నో నగరాలను దాటి ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి, ఏఈ ప్రజ్ఞ, గంగుల కృష్ణారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వీరస్వామి పాల్గొన్నారు.
సుపరిపాలన కోసమే..
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే వార్డు కార్యాలయాలని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ అన్నారు. నందనవనం మోడల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. డీసీ సురేందర్‌రెడ్డి, ఈఈ కోటేశ్వరరావు, వార్డు అధికారులు విఘ్నేశ్వర్, హేమునాయక్, శ్రీదేవి, బీఆర్ఎస్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, గిరి యాదవ్, శివయాదవ్, శశి తదితరులు పాల్గొన్నారు.
హయత్‌నగర్ డివిజన్ కేంద్రంలో..
హయత్‌నగర్ డివిజన్ కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ వివిధ శాఖల అధికారులతో కలిసి నూతన వార్డు కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు.