గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 30, 2020 , 00:56:50

అతివలకు అండగా సాహిత్యం..!

అతివలకు అండగా సాహిత్యం..!
  • షీటీమ్‌, భరోసా సహకారంతో పుస్తకాలు ప్రచురితం
  • బాధితులకు సాంత్వన చేకూర్చేలా కవిత్వాలు, కథలు..
  • ‘హితైషీ’, ‘నింగిని గెలిచిన నేల’
  • 78మంది కవయిత్రులతో హితైషీ
  • 47మంది రచయిత్రులతో ‘నింగిని గెలిచిన నేల’
  • ప్రపంచ తెలుగు సాహితీ చరిత్రలో మహిళా భద్రత మీద తొలి కథా సంపుటి


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళా కవులు, రచయితలతో అక్షరయాన్‌ అనే గ్రూపును అయినంపూడి శ్రీలక్ష్మి ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై వారు అండగా ఉంటారు. అందులో భాగంగానే నగరానికి చెందిన 78మంది కవయిత్రులతో కవితా సంపుటి ‘హితైషీ’ని తీసుకొచ్చారు. కవిత్వాల రూపంలో ఆకతాయిల భరతం ఎలా పట్టాలో వివరించారు.  ఈ పుస్తకం ఈనెల 24న ఐటీ స్వాతి లక్రా ఆవిష్కరించారు. 


‘బాధితురాల మేలుకో.. షీటీం, భరోసాల గురించి తెలుసుకో..? ఆకతాయిలు ఆటపట్టించారని ఇంట్లో ఉంటే ఎలా? అత్యాచారానికి గురయ్యావని ఆత్మహత్య చేసుకుంటే సమస్య సమసిపోతుందా? నీ తొందరపాటు నిర్ణయంతో నువ్వు వెళ్లిపోతావు..? మరి నీ దారిలో ఇంకెంత మంది అబలలు బలికావాలి? ఆలోచన చేయాల్సిన బాధ్య త బాధితులపైన ఉండదా? తెలంగాణ ప్రభుత్వం అందించిన షీటీ మ్‌, భరోసా ఆయుధాలను ఉపయోగించి ప్రబుద్ధుల భరతం పట్ట వా? స్త్రీ అత్యాచారానికి గురయితే జీవితం వృథా అనే భావన ఇంకా తుడిచిపెట్టవా? ఇంకెన్నాళ్లు నీ మనసుకు బంధనం? కలబడి నిలబడేదెన్నడూ?” అంటూ మహిళా కవులు, రచయితలు తమ కలాలను ఎక్కుపెట్టారు. అతివల కోసం అతివలతోనే యజ్ఞం మొదలెట్టారు. బాధితుల ఆక్రందనలను తుడిచేయడానికి  నడుంబిగించారు. ఆలోచన రేపే కవితలు.. ధైర్యానిచ్చే కథలతో ముందుకొచ్చారు. షీటీమ్‌, భరోసా సహకారంతో అక్షరయాన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘హితైషీ, ‘నింగిని గెలిచిన నేల’ పుస్తకాలను తీసుకురావడం విశేషం. ఆ సాహిత్యాన్ని విస్త్రతంగా ప్రచారం చేయడానికి అధికారులు ప్రణాళికలు చేశారు. 


మనసును తాకే అక్షరాలు..!!

దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల రక్షణకు తెలంగాణ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. వారిని కంటికిరెప్పలా కాపాడుకుంటోం ది. ఆకతాయిల ఆటకట్టించి మహిళల్లో ఆనందం నింపడానికి ‘షీ టీమ్‌', వేదనను తుడిచేసి తల్లి పాత్ర పోశించే ‘భరోసా’ను ఏర్పాటు చేసి అతివలకు అండగా ఉంటూ వస్తోంది. అయితే అక్కడక్కడా జరి గే కొన్ని హృదయ విధారక ఘటనలు, జుగుప్సాకరమైన సంఘటనలు సమాజాన్ని దిగజార్చుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ.. తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు వణుకే. కుటుంబసభ్యుల నుంచి కూడా మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నా రు. ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో తెలియని సందిగ్ధ పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో మాత్రం పోలీసులు వారి రక్షణకు పెద్దపీట వేయడం శుభపరిణామం. టెక్నాలజీ వినియోగం, శిక్షలు తొందరగా పడేలా చూడటం.. 24గంటల రక్షణ సేవలు కల్పించడంతో మహిళలు ధైర్యంగా ఉండగలుగుతున్నారు. అంతేకాదు కొంతమంది బాధితులు వారి సమస్యను బయటకు చెప్పడానికి వెనకాడి జఠిలం చేసుకుంటున్నారు. అందుకే షీటీమ్‌, భరోసాల ప్రాముఖ్యతను మహిళలకు అర్థమయ్యేలా కవులు, రచయితలు నడుం బిగించారు.  బాధితుల ఆక్రందనలు వినిచలించిపోయి.. వేదనలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచనలు అందించే పదునైన కవిత్వాలు, కథలను ప్రచురించారు. ఐజీ స్వాతిలక్రా మార్గదర్శకంలో పుస్తకాలను తీసుకొచ్చారు. 


బాధితులకు బాసటగా..!!

మహిళాకవులు, రచయితలతో అక్షరయాన్‌ అనే గ్రూపును అయినంపూడి శ్రీలక్ష్మి ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన అన్ని అం శాలపై అండగా ఉంటారు. అందులో భాగంగానే నగరానికి చెందిన 78మంది కవయిత్రులతో కవితాసంపుటి ‘హితైషీ’ని తీసుకొచ్చారు. కవిత్వాల రూపంలో ఆకతాయిల భరతం ఎలా పట్టాలో వివరించా రు.  ఈ పుస్తకం ఈనెల 24న ఐటీ స్వాతిలక్రా ఆవిష్కరించారు. ఇక మరో పుస్తకం.. ప్రపంచ తెలుగు సాహితీ చరిత్రలో మహిళా భద్రత మీద తొలి కథా సంపుటి 47మంది రచయిత్రులతో ‘నింగిని గెలిచిన నేల’ను సిద్ధం చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న హింసను తుడిచిపెట్టే యజ్ఞంలో మహిళా సాహితీవేత్తలు తోడవడం మంచి విషయమని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బాధితులకు బాసటగా నిలవడంలో సాహిత్యంపాత్ర గొప్పదని అభిప్రాయపడుతున్నారు.


షీ రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్‌

అక్షరమంటే వెన్నెల సంతకం మాత్రమే కాదు. సమాజ మార్పునకు ఆయుధం కూడా. అం దుకే కేవలం అతివల కోసమే అక్షరాన్ని వాడాలనుకున్నాం. ‘అక్షరయాన్‌' తెలుగు కవయిత్రుల, రచయిత్రుల వేదిక. షీటీమ్‌, భరోసా కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి బాధితుల జీవి త గాథలనీ తెలుసుకున్నాం. కన్నీరు కార్చడం కాదు.. అక్షరనీరాజనంగా రెండు పుస్తకాలను తీసుకురావడానికి పూనుకున్నాం. సమాజం లో స్త్రీ చైతన్యం వెల్లివిరియాలంటే న్యాయపరంగా లభించే హక్కులపై అవగాహన తెలిసేలా ఈ పుస్తకాలను రూపొందించాం. 

- అయినంపూడి శ్రీలక్ష్మి, అక్షరయాన్‌ వ్యవస్థాపకురాలు


స్త్రీ శక్తులుగా షీటీం, భరోసా

షీటీం భరోసా గురించి తెలుసుకుంటే చాలు సమస్యలు దూరమవుతాయి. మహిళల రక్షణ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్‌. అందుకే బాధితుల పక్షాన నిలబడే అవకాశం వచ్చింది. కవిత్వం, కథలతో భయాలను పోగొట్టడమే మా ప్రధానఉద్దేశం. షీటీం, భరోసాలు స్త్రీ శక్తులు. అవి మహిళలను వేధించాల ని చూసే ఆకతాయిల భరతం పట్టే ఆయుధా లు. వేధింపులకు భయపడకుండా ఎదుర్కోగలగాలి. ముందుకొచ్చి షీటీం, భరోసాలకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే మరో మహిళకు ఆపద రాకుండా అడ్డుకోగలుగుతాం. మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ఐజీ స్వాతిలక్రాకు అభినందనలు. 

- విశ్వైక, కవయిత్రి, సినీ గేయ రచయిత


 సమస్యను రూపుమాపే సాధనం

హితైషీ, భరోసా వంటి పుస్తకాలు నేటి యువతరానికి కరదీపికలు. సమస్యలపై అవగాహన కలిగించేందుకు.. వాటిని ఎదుర్కోనేందుకు బాధితులపై స్పందించేందుకు.. తగిన సాధనాలు. సాటి మహిళల జీవనం సాఫీగా సాగేందుకు అత్యావశ్యాకాలు. ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావడం వల్ల అసభ్యంగా ప్రవర్తించేవారు, అన్యాయాలు, అత్యాచారాలు చేసేవారు ఎలా ఉంటారు? ఏమేం చేస్తున్నారో అలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలి తెలుసుకుని అప్రమత్తులై ఉండటానికి ఆస్కారం ఉం టుంది. ముఖ్యంగా ప్రభుత్వం రక్షణ కల్పించేందుకు ఎలా సిద్ధంగా ఉందో తెలుస్తుంది. 

- సమ్మెట విజయ, రచయిత్రి, ఉపాధ్యాయురాలు


ఈ పుస్తకాలతో మార్పు రావాలి

సాహిత్యం సమాజానికి ప్రతిబింబం. తన రచనలతో సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కవి కలానికి ఉంటుంది. కలం గళం జుగల్బందీగా మారి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశాయి. స్వాతంత్ర సంగ్రామంలో కూడా సాహిత్యం పాత్ర చాలా గొప్పది. అన్ని జిల్లాల కవయిత్రులతో సాహిత్య సాధికారిత వైపు చేయిచేయి కలిపి చేతన నింపుకుని కదులుతోంది. అందు లోభాగంగా భరోసా కథల ద్వారా పసిమొగ్గలపై జరుగుతున్న అత్యాచారాలు, హితైషీ కవి తా సంకలనంతో షీటీం చేస్తున్నటువంటి కా ర్యక్రమాలను వెలువరించడం జరిగింది. కొం దరిలోనన్నా మార్పునకు నాం ది పలకాలి. 

-రమాదేవి కులకర్ణి, ప్రిన్సిపాల్‌, రచయిత, మోటివేషనల్‌ స్పీకర్‌


logo