నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అన్నదమ్ముల మధ్య అవగాహన పెరుగుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగులకు పనిభారం ఎక్కువ అవుతుంది. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. భక్తి పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. స్థిర చరాస్తుల వల్ల ఆదాయం కలిసి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నతవిద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ పనులను చేపడతారు. వ్యవసాయదారులకు మంచి సమయం. పారి శ్రామికవేత్తలు న్యాయ పరమైన సమస్యలు అధిగమిస్తారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు తొలగుతాయి. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సాహసంతో పనులు చేస్తారు. భక్తి పెరుగుతుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉత్సాహంతో ఉంటారు. రాజకీయ నాయకుల పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ప్రయాణాల వల్ల ఖర్చులు, అలసట ఉండవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి, స్థానచలన సూచన. భూమి కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూలం. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. వారం చివర్లో రావలసిన డబ్బు చేతికి అందకపోవడంతో కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు అనుకూలం. బంధువులతో పనులు నెరవేరుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు.
వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. భూముల కొనుగోలు విషయంలో అప్రమత్తత అవసరం. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేపడతారు.
మానసికంగా సంతృప్తిగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ, సకాలంలో పూర్తవుతాయి.
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసర చర్చలకు దూరంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం చేస్తారు. భక్తి పెరుగుతుంది. పెద్దల మన్ననలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో పాక్షిక విజయం. అధికారులతో అభిప్రాయ భేదాలు కొనసాగవచ్చు.
మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణానికి అవకాశం. అయితే, వీసా ఆలస్యంగా రావచ్చు. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్నేహితులు, బంధు మిత్రులతో పనులు పూర్తవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు అనుకూలం. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయుల సూచనలను పాటిస్తారు. భక్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు.
ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులలో జాప్యం ఉంటుంది. శుభకార్య యత్నాలలో పెద్దల సహకారం తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. భూమి కొనుగోలులో అప్రమత్తత అవసరం. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. పై అధికారులతో దూరం పెరగవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది.
గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయులతో ఇబ్బందులు ఎదురవుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఉత్పాదన పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వారం. ఆత్మీయుల అండ లభిస్తుంది. భూమి, వాహనం కొనుగోలుపై మనసు నిలుపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం ఉంటుంది. సమాజంలో పలుకుబడితో కొన్ని పనులు పూర్తవుతాయి. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు.
ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అవసరానికి డబ్బు లేక చేబదులు అవసరం ఏర్పడవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులు స్థానచలనం వల్ల ఇబ్బందిపడతారు. కొత్త పనులు ప్రారంభించకుండా పాతవాటిని పూర్తి చేయడంపై మనసు నిలపాలి. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థలలో చేరతారు. వివాహది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. భక్తి పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారుల అండదండలు పొందుతారు. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేణా పెరుగుతుంది. అయితే ఊహించని ఖర్చుల మూలంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం.
ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భక్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉత్సాహాన్నిస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వల్ల ఆదాయం వస్తుంది. పెద్దల సూచనల మేరకు పనులు చేపడతారు.
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
Ugadi Panchangam 2022 | మేషరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
Ugadi Panchangam 2022 | వృషభ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
Ugadi Panchangam 2022 | సింహ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
Ugadi Panchangam 2022 | తుల రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?