సూర్యాపేట : రైతులకు వ్యవసాయానికి సరిపడా కరెంటు అందించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్ రోడ్ తండ వద్ద ఉన్న సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని వాపోయారు.
అసలే వర్షాకాలంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నకు, కరెంటు కోతలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.