Ugadi Panchangam 2022 | తుల రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
తుల
చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయం: 8 వ్యయం: 8
రాజపూజ్యం: 7 అవమానం: 1
చైత్రం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. అనవసరమైన ఖర్చుల వల్ల మనశ్శాంతి లోపించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి.
వైశాఖం: ఈ నెలలో గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తి పెరుగుతుంది. బంధు మిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సలహాలను పాటిస్తారు. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు.
జ్యేష్ఠం: రావలసిన డబ్బు వస్తుంది. బాకీలు తీర్చి ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. భూమి కొనుగోలు కలిసి వస్తుంది.
ఆషాఢం: అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణతోపాటు ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం.
శ్రావణం: విద్యార్థులు శ్రమించ వలసిన సమయం. ఉద్యోగులకు పనిచేసే చోట పరపతి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులపై మనసు నిలపడం మంచిది.
భాద్రపదం: ఈ నెల అన్ని విషయాల్లో జాగ్రత్త పాటించడం అవసరం. అశ్రద్ధ మూలంగా నష్టాలు ఎదురుకావచ్చు. మనశ్శాంతి కరువవుతుంది. ఓపికతో ముందుకు వెళ్లడం అవసరం. బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, మనస్పర్ధలు తలెత్తవచ్చు.
ఆశ్వయుజం: వ్యాపారులకు భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తారు.
కార్తికం: ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక ఒప్పందాలలో ఏమరుపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భూలావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.
మార్గశిరం: ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. సహోద్యోగులతో స్నేహం కుదురుతుంది. మిత్రులతో పనులు నెరవేరుతాయి. బాధ్యతలు శ్రద్ధతో పూర్తిచేస్తారు.
పుష్యం: విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆలోచించి పనిచేయడం మంచిది.
మాఘం: మాట పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి.
ఫాల్గుణం: ప్రారంభించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సోదరులు, బంధువుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం వస్తుంది.
* ఈ రాశి వారికి ఆరింట గురువు, అర్ధాష్టమ శని, సప్తమ రాహువు, లగ్న కేతువు వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. నాలుగు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. రుద్రాభిషేకంతో మంచి ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయస్వామి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేసుకోండి.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

