Ugadi Panchangam 2022 | సింహ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 8 వ్యయం: 14
రాజపూజ్యం: 1 అవమానం: 5
చైత్రం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. అయితే రాహువు, శని మార్పు వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఆదాయం పెరుగుతుంది.
వైశాఖం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. మంచి-చెడు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది.
జ్యేష్ఠం: ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ, వృథా ఖర్చులు ఉంటాయి. కుటుంబ పెద్దల సలహాలు పాటించండి. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఆషాఢం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అప్పుల బాధ తప్పుతుంది. బాధ్యతలను చాకచక్యంగా నిర్వహిస్తారు.కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
శ్రావణం: సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. అధికారుల ఒత్తిడి వల్ల మనశ్శాంతి కరువవుతుంది. బదిలీ అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
భాద్రపదం: అన్ని విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలు, భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు.
ఆశ్వయుజం: వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. రాజకీయనాయకులకు మంచి సమయం.
కార్తికం: వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అధికారులు పనితనాన్ని గుర్తిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది.
మార్గశిరం: తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. తోటివారి విమర్శలతో ఇబ్బంది పడతారు. రాబడి బాగుంటుంది.
పుష్యం: విద్యార్థులకు అనుకూల సమయం. ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది కారణంగా సమస్యలు ఎదురుకావొచ్చు.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి
ఫాల్గుణం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బయట సమస్యలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ, చేసే పనిమీద మనసుపెట్టండి. ఆత్మీయులు, మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
* ఈ రాశి వారికి అష్టమ గురువు, సప్తమ శని వల్ల ఇబ్బందులు కలుగుతాయి. భాగ్యంలో రాహు సంచారం ప్రతికూలం. గురు, శని, రాహు గ్రహాల ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. శివారాధన, దత్తోపాసన, దుర్గాదేవి పూజ వల్ల శుభాలు కలుగుతాయి.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

