Ugadi Panchangam 2022 | మేషరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 14 వ్యయం: 14
రాజపూజ్యం: 3 అవమానం: 6
చైత్రం: ఈ నెలలో శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శుభకార్యాలు చేస్తారు. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వైశాఖం: అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు రాణిస్తారు.
జ్యేష్ఠం: ఈ నెల ప్రథమార్ధం మిశ్రమంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో శుభఫలితాలు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
ఆషాఢం: ఈ నెల గ్రహస్థితి ఓ మోస్తరుగా ఉంది. వృథా ఆలోచనల కారణంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే, ఖర్చులు పెరుగుతాయి. అలసటకు గురవుతారు.
శ్రావణం: రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. శ్రద్ధ అవసరం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు, చీకాకులు ఉంటాయి. పొదుపుపై మనసు నిలుపుతారు. ఈ నెల ద్వితీయార్ధంలో మానసిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం.
భాద్రపదం: ఈ నెలలో ప్రధాన గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కుటుంబంలో పెద్దల సలహాలు తీసుకుంటారు. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది.
ఆశ్వయుజం: పనుల్లో శ్రమకు తగ్గ విజయం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి మార్పు వస్తుంది. విద్యార్థులకు మంచి సమయం.
కార్తికం: ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కార్య నిర్వహణలో ఏమరుపాటు తగదు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. సంకల్పంతో ముందుకు వెళ్తారు.
మార్గశిరం: ప్రారంభించిన పనుల్లో మొదట్లో ఆటంకాలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. సరైన మార్గనిర్దేశం లభిస్తుంది.
పుష్యం: ఇంటా బయటా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. నెలాఖరులో నిర్మాణాది పనులు చేపడతారు.
మాఘం: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకోవడం అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం. శుభకార్య నిర్వహణలో అయినవారి సహకారం లభిస్తుంది
ఫాల్గుణం: ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు.
* ఈ రాశివారికి గురువు ద్వాదశంలో, దశమంలో శని, జన్మస్థానంలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం ప్రతికూలం. గురు, శని, రాహు, కేతు గ్రహాలకు జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకం చేయించండి. శివుడు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో శుభఫలితాలు పొందుతారు.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

