Ugadi Panchangam 2022 | వృషభ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
వృషభం
కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం: 8 వ్యయం: 8
రాజపూజ్యం: 6 అవమానం: 6
చైత్రం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
వైశాఖం: అనుకున్న సమయంలో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.
జ్యేష్ఠం: ముఖ్యమైన పనులు కుటుంబ పెద్దల సహకారంతో పూర్తవుతాయి. గృహ నిర్మాణ పనులు మొదలుపెడతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. స్నేహితులతో వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనసు నిలపండి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. సహనంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.
శ్రావణం: వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. వ్యాపారులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
భాద్రపదం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
ఆశ్వయుజం: పనులు వేగంగా పూర్తవుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. విహారయాత్రలు చేపడతారు. శుభకార్య ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహనిర్మాణ పనులు మొదలుపెడతారు.
కార్తికం: ఈ నెల ప్రథమార్ధంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ద్వితీయార్ధంలో కొన్ని ఆటంకాలున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.
మార్గశిరం: వివాదాలకు దూరంగా ఉంటూ పనులు నెరవేరుస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థాన చలన సూచన.
పుష్యం: ఉద్యోగంలో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిచేసే చోట అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ముందుకు రావచ్చు. జాగ్రత్త వహించండి.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి బాగుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. సాహితీవేత్తలకు గుర్తింపు లభిస్తుంది.
ఫాల్గుణం: ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో శ్రద్ధ కనబరుస్తారు. మంచి ఫలితాలను పొందుతారు.
* ఈ రాశి వారికి ఏకాదశంలో గురువు, ఆరింట కేతువు శుభఫలితాలు ఇస్తారు. పదో స్థానంలో శని, పన్నెండో స్థానంలో రాహువు ప్రతికూల ఫలితాలు ఇస్తారు. శని, రాహువు ప్రీత్యర్థం ఆ రెండు గ్రహాలకు జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయడం, శివారాధన, అమ్మవారి సేవ చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

