Venus Transit | శుక్రుడు ఆనందం, విలాసం, అందం, కళలు, సాహిత్యం, భౌతిక సుఖాలకు అధిపతి అని జ్యోతిషశాస్త్రం చెబుతున్నది. ఒక వ్యక్తి జన్మ జాతకంలో శుక్రుడి స్థానం చాలా కీలకమైంది. ప్రత్యేకమైంది కూడా. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు శుభ స్థానంలో ఉంటే వారు జీవితంలో అన్ని రకాల సుఖాలు, సిరిసంపదలను పొందుతారు. శుక్రుడు వివాహానికి సంబంధించిన గ్రహం. అది శుభస్థానంలో ఉంటే ఆ జీవితంలో అన్నిరకాల ఆనందాలను పొందుతాడు. మే 31 నుంచి శుక్రుడు కుజుడితో కలిసి మేషరాశిలో సంచరించబోతున్నాడు. మీనరాశి నుంచి స్థానం మార్చుకోనున్నాడు. మేషరాశిలో శుక్రుడి సంచారంతో 12 రాశులన్నింటిని ప్రభావితం చేయనున్నది. కానీ, శుక్రుడు ప్రత్యేకంగా కొన్ని రాశులపై ప్రభావాన్ని చూపించనున్నాడు. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం..!
మేష రాశి లగ్నస్థానమైన మొదటి ఇంట్లోనే శుక్రుడు సంచరించబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో మీ ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. డబ్బు సంపాదించేందుకు మార్గాలు పెరుగుతాయి. మీకు ధనలాభం కోసం కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. దాంతో మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులను గమనిస్తారు.
శుక్రుడు మిథునరాశి 11వ ఇంట సంచరించనున్నాడు. జాతకంలో 11వ ఇల్లు లాభం, ఆదాయానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. లాభ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించగలిగే అవకాశం ఉంది. కెరీర్ గురించి చెప్పాలంటే.. మీరు ఉద్యోగంలో మంచి అవకాశాలను పొందుతారు. డబ్బు ఆదా చేయాలన్న ప్రయత్నాలు ఫలిస్తాయి.
శుక్రుడు మేష రాశిలో సంచరిస్తున్నప్పుడు.. కర్నాటక రాశిలో పదవ ఇంట్లో ప్రవేశించనున్నాడు. పదవ ఇంట్లో శుక్ర సంచారంతో ఉద్యోగంలో మార్పులు కలిగే అవకాశాలుంటాయి. మీకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతాయి. ఈ సమయంలో మీ ఖర్చులు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
శుక్రుడు ధనుస్సురాశిలో సంచరించనున్నాడు. జాతకంలోని ఐదో ఇంట్లో సంచారంతో కెరియర్లో మీకు కావాల్సిన ప్రయోజనాలు సమకూరుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. మీరు వ్యాపారంలో లాభం పొందుతారు. కొత్త ప్రణాళికను ఆచరణలోకి తీసుకువస్తారు. అప్పులు కొంత తగ్గుతాయి.
“Tri Ekadash Yogam 2025 | త్రి ఏకాదశ యోగం.. కన్యరాశి సహా ఈ మూడురాశుల వారికి అన్నీ శుభాలే..!”