Tri Ekadash Yogam 2025 | జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు, శనైశ్చరులిద్దరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సూర్యుడి గ్రహాలకు రాజుగా పేర్కొంటారు. ఆత్మ, గౌరవం, శక్తి గ్రహంగా చెబుతుంటారు. రవి ప్రభావం కారణంగా కెరీర్లో కావాల్సిన విజయాలను సాధిస్తారు. శని కర్మ, న్యాయానికి అధిపతి. కర్మల ఆధారంగా అనుగ్రహిస్తుంటారు. సూర్యుడు, శని మధ్య శత్రుత్వం ఉంటుంది. కానీ వారి ప్రభావంతో ఏర్పడిన రాజయోగం కొన్ని రాశుల వారికి మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ నెల 20న శని మీనంలో, సూర్యుడు వృషభంలోకి ప్రవేశించారు. ఈ పరిస్థితిలో మే 20న మధ్యాహ్నం 3:05 గంటలకు, సూర్యుడు, శని ఒకదానికొకటి 60 డిగ్రీల వద్ద ఉన్నారు. సూర్యుడు, శని ఈ స్థానాల కారణంగా త్రి ఏకాదశ యోగం ఏర్పడుతుంది. దాంతో కన్య రాశితో సహా మరో రెండు రాశుల వారికి కెరీర్, వ్యాపారం, జీవితం, విద్యారంగంలోని వారికి మార్పులుంటాయి.
వృషభ రాశి వారికి త్రి ఏకాదశ యోగం కొత్త అవకాశాలు కల్పిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభించే అవకాశం ఉంటుంది. మీరు వివాహ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. శని ప్రభావంతో ప్రత్యర్థులతో ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. విశ్వాసంతో అన్ని పనులు చక్కబెడుతారు.
కర్కాటక రాశివారు కొన్ని శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత కేసులలో నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. వ్యాపారులకు గత కొంతకాలంగా రాకుండా పెండింగ్లో ఉంటే.. చేతికందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం గడుపుతున్న వారి మధ్య సంబంధాలు మరింత బలపడుతాయి.
కన్య రాశి వారికి జీతం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు పొందే అవకాశం ఉంది. సామాజిక స్థాయిలో కొత్తగా మంచి స్నేహితులు ఏర్పడతారు. కెరీర్లో పురోగతి సాధ్యమవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. సూర్యుడి ప్రభావం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది.