Jupiter Transit | దేవగురువు బృహస్పతి అని పిలిచే గురుగ్రహం జ్యోతిషశాస్త్రంలో శుభప్రదమైన, ప్రభావవంతమైన గ్రహంగా పేర్కొంటారు. ఈ గ్రహం జ్ఞానం, మతం, న్యాయం, విద్య, సంపద, మంచికి చిహ్నంగా భావిస్తారు. బృహస్పతి దృష్టి అమృతానికి సమానమైందని పేర్కొంటారు. ఐదు, ఏడు, తొమ్మిది ఇంటిని చూడడం వల్ల సానుకూలత, పురోగతి, శ్రేయస్సు కలుగుతుంది. గత సంవత్సరం నుంచి దేవుగురువు బృహస్పతి శుక్రుడి రాశి అయిన వృషభంలో సంచరిస్తున్నాడు. ఈ కాలంలో భౌతిక సుఖాలు, కళ, అందం, ఆర్థిక రంగంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపించారు. తాజాగా మే 15న తెల్లవారు జామున 2.30 గంటలకు బృహస్పతి బుధుడి రాశి అయిన మిథునంలోకి ప్రవేశించాడు. ఈ సంచారం కారణంగా పలు రాశుల వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్ రంగంలోని వారికి అనేక మార్పులు తేనున్నది.
దేవగురువు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించడంతో ప్రత్యేక ప్రాముఖత ఉంటుంది. ఈ సంచారం కారణంగా గురువు ఈ రాశి మూడో ఇంట్లోకి ప్రవేశించాడు. మూడో ఇంటిని శౌర్యం, ధైర్యం, కమ్యూనికేషన్, ప్రయాణాలకు సంకేతంగా పేర్కొంటారు. ఈ సమయంలో మానసికంగా బలంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆలోచనలను మెరుగ్గా వ్యక్తపరుస్తారు. మీ ప్రసంగాలు మరింత ఆకట్టుకుంటాయి. తోబుట్టువులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. వారి సహకారంతో అనేక పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. విద్యకు సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఈ సమయంలో వ్యాపారం, వృత్తి పనుల్లో మీరు చేపట్టే ప్రయత్నాలతో మంచి లాభాలను పొందుతారు.
గురువు మిథున రాశిలోకి సంచారంతో వృషభ రాశి రెండో ఇంట్లోకి వెళ్లాడు. ఇది సంపద, వాక్కు, కుటుంబం, విలువలకు సంకేతంగా పేర్కొంటారు. ప్రసంగం మధురంగా మారుతుంది. మీరు చెప్పేది జాగ్రత్తగా అందరూ వింటారు. మీ ఆలోచనలను అభినందిస్తారు. కుటుంబంలో కూడా ఆనందం, సామరస్యం ఉంటుంది. అయితే, సంపదను కూడబెట్టుకోవడంలో కొంత ఇబ్బందులుపడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం, ఆదా చేయడం ద్వారా స్థిరత్వాన్ని సాధిస్తారు. బృహస్పతి దృష్టి ఆరవ, ఎనిమిదవ, పదవ ఇళ్లపై పడుతున్నది. ఇది ఉద్యోగం, వ్యాపారంలో మెరుగుదల, పూర్వీకుల ఆస్తి నుంచి లాభం, పనిలో పురోగతి అవకాశాలు మెరుగవుతాయి. ఈ సమయం అత్తమామల నుంచి మంచి మద్దతును అందుకుంటారు. ప్రత్యర్థులకు భయపడాల్సిన అవసరం లేదు. వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండవు.
గురు సంచారం మిథున రాశి చాలా ముఖ్యమైంది. ఎందుకంటే బృహస్పతి సొంతరాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారం మీ జీవితంలో తీవ్ర మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచన, అవగాహన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. విద్య, ప్రేమ సంబంధం, వివాహం, అదృష్టం పరంగా చాలా శుభ సంకేతాలు ఉంటాయి. విద్యను అభ్యసిస్తున్నట్లయితే విజయానికి అవకాశాలు ఉంటాయి. మీకు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాహం చేసుకోవాలని భావించే వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వివాహితులకు వారి వైవాహిక జీవితం మధురంగా మారుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగుతాయి. కొత్త పరిచయాల కారణంగా లాభం పొందుతారు.