Shanishchari Amavasya | జ్యోతిషశాస్త్రంలో శనైశ్చరుడికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆయన కర్మకు కారకుడు. అలాగే, న్యాయానికి అధిపతిగా భావిస్తారు. వ్యక్తి చేసే కర్మలను బట్టి ఆయన ఫలితాలను ఇస్తుంటాడని పండితులు చెబుతుంటారు. నవగ్రహాల్లో మందగమనుడనే పేరు ఆయనకు ఉంది. శని ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. మొత్తం రాశిచక్రం ఒక భ్రమణం పూర్తి చేసేందుకు దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల శనైశ్చరుడి సంచారం దీర్ఘకాలిక, లోతైన ప్రభావం చూపుతుంది. ఈ నెల (మే) 26న శని అమావాస్య రోజున మధ్యాహ్నం మొదలై.. 27న ఉదయం వరకు గడియలు ఉన్నాయి.
శనిదేవుడు మీనరాశిలో ఉన్నాడు. మంగళవారం రోజున శనైశ్చర జయంతి వచ్చింది. మీనరాశిలో శని సంచారంతో కొన్ని రాశులకు శుభ ఫలితాలను అనుగ్రహించనున్నాడు. ఆయన అనుగ్రహం ఉంటే.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరే అవకాశాలుంటాయి. చేపట్టిన కార్యాల్లో విజయం దక్కడంతో పాటు ఆర్థికంగా మెరుపడుతారు. చాలాకాలంగా ఎంతోకష్టపడి పని చేస్తున్న, మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా మారనున్నది. శనైశ్చరుడి ప్రభావంతో జీవితంలో స్థిరత్వం, క్రమశిక్షణ, పురోగతి ఉండనున్నది. ఈ క్రమంలో ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉండనుందో చూద్దాం..!
మీనరాశిలో మందగమనుడి సంచారంతో వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో శనిదేవుడు లాభం, ఆదాయ స్థానాల్లో సంచరిస్తుండడం కారణంగా ఆదాయం పెరిగే సంకేతాలున్నాయి. ఉన్నత చదువులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ సమయంలో వారి కృషికి తగిన విధంగా సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కెరియర్లో పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. దాంతో పాటు ఆధ్యాత్మిక, కుటుంబంలో జరిగే శుభకార్యాల్లో పాల్గొనే సూచనలున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
శని సంచారంతో మీనరాశి వారికి సైతం కృషికి తగ్గ ఫలితాలు దక్కే అవకాశాలున్నాయి. పని చేస్తున్న చోట ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి సైతం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. కోర్టుకు సంబంధించిన ఏదైనా కేసులతో ఇబ్బందులు పడుతుంటే.. సానుకూల తీర్పులు వచ్చే అవకాశాలున్నాయి.
శనైశ్చరుడి ప్రభావంతో మకర రాశి వారికి ప్రయత్న కార్యాల్లో విజయం దక్కుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చట్టపరమైన విషయాల్లోనూ విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారంలో అకస్మాత్తుగా భారీ లాభాలను పొందుతారు. సామాజికంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్తగా ఆస్తి లేదంటే.. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అలాగే, కొందరికి తోబుట్టువుల నుంచి సహకారం, మద్దతు లభిస్తాయి.