Tridashansha Yogam | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారానికి ప్రత్యేకత ఉన్నది. గ్రహాల మార్పులు రాశులపై ప్రభావం చూపుతుంటాయి. ఈ నెల 16న బ్రహ్మ ముహూర్తానికి ముందు ప్రత్యేక యోగం ఏర్పడింది. బుధుడు, బృహస్పతి ఒకదానికొకటి 108 డిగ్రీలో కోణంలోకి వచ్చారు. దీన్ని త్రిదశాంశ యోగంగా పిలుస్తారు. ఈ యోగం తెల్లవారు జామున 3.03 గంటలకు ఏర్పడింది. బ్రహ్మ ముహూర్తానికి ముందు ఏర్పడుతుండడంతో శక్తి, ప్రభావం బాగా పెరుగుతుంది. బుధుడు, బృహస్పతి సయోగంతో పలు రాశులపై సానుకూల ప్రభావం పడుతుంది. దాంతో ఆయా రాశులవారు అదృష్టం వరించడంతో పాటు పలు అంశాల్లో విజయం చేకూరే అవకాశం ఉంది. ఈ యోగం ప్రభావంతో కెరీర్, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు తీసుకురానుంది. మానసిక శాంతి, ఆనందం, కొత్త అవకాశాల అవకాశాలు ఉంటాయి. త్రిదశాంశ యోగంతో ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడనున్నదో తెలుసుకుందాం రండి..!
త్రిదశాంశ యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆకస్మిక ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం, సామరస్యం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. పదోన్నతి పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం, పెట్టుబడి పెట్టిన వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు రావడంతో పాటు ప్రయోజనాలు కలుగనున్నాయి. ఏవైనా ఆర్థిక పరమైన ఇబ్బందులుంటే అన్నీ తొలగిపోతాయి. డబ్బును ఆదా చేయాలన్న మీ ఆశ నెరవేరుతుంది.
త్రిదశాంశ యోగంతో మీకు మంచి రోజులు మొదలుకానున్నాయి. మీ ధైర్యం రెట్టింపవుతుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. పదోన్నతి పొందే సూచనలు గోచరిస్తున్నాయి. మీ కృషికి ప్రశంసలు పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వనరులుంటాయి. ప్రధాన వ్యాపార ఒప్పందంతో గణనీయమైన లాభాలుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆకస్మిక ద్రవ్య లాభం పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి.
త్రిదశాంశ యోగం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. వివాహితులకు సంతానం కలిగే అవకాశాలున్నాయి. ఈ సమయం వాహనం, ఆస్తిని కొనుగోలు చేసేందుకు సూచనలున్నాయి. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి వారు కోరుకున్న స్థానానికి బదిలీ జరిగే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
Read Also :
Lucky Horoscope | నేటి ధనత్రయోదశి రోజున మూడు శుభయోగాలు.. ఈ రాశులవారిపై కాసులవర్షమే..!