Sun-Mars Conjunction | దీపావళి పండుగ సమీపించింది. ఈ పండుగకు ముందు ధనత్రయోదశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేడు (శనివారం) రెండుగ్రహాలు కలువనున్నాయి. కుజుడు, సూర్యుడితో కలిసి అరుదైన సంయోగాన్ని ఏర్పరచనున్నాడు. శుభప్రదమైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. సూర్యుడిని గ్రహాలకు రాజుగా పేర్కొంటారు. ధనత్రయోదశి రోజున జరుగుతుండడంతో పలురాశుల వారికి శుభాలను ప్రసాదించనున్నది. ఆర్థిక లాభంతో పాటు ఉద్యోగరంగంలో ఉన్నవారు ఉద్యోగోన్నతి పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంతకీ అ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం రండి..!
కన్యారాశి వారికి కుజుడు, గ్రహాల రాజు అయిన సూర్యుడి కలయిక ప్రయోజనకరంగా ఉండనున్నది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. కుజుడు, సూర్యుడి కలయికతో సంపద సమకూరుతుంది. మీ ఆకస్మిక ద్రవ్య లాభాల అవకాశాలను పెంచుతుంది. మీరు కొత్త అవకాశాలను అందుకుంటారు. వ్యాపారంలో పాల్గొన్న వారికి కొత్తగా ఏదైనా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సంబంధాలు బలపడతాయి.
తులారాశి వారికి కుజుడు, సూర్యుడి సంయోగంతో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంయోగం మీ లగ్న ఇంట్లో ఏర్పడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కెరీర్, వ్యాపారంలో స్థిరత్వం, పురోగతిని పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొనసాగుతున్న ఏవైనా కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి.
కుంభరాశి వారికి కుజుడు, సూర్యుడి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంయోగం మీ జాతకంలోని తొమ్మిదో ఇంట్లో ఏర్పడుతుంది. ఇది అదృష్టాన్ని పెంచే అవకాశాలను సృష్టిస్తుంది. మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఇది మీ కెరీర్, వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుపడే సూచనలున్నాయి. పనిచేసే చోట మీ కృషికి మంచి ఫలితాలుంటాయి. సరికొత్త మైలురాయిని చేరుకుంటారు.
Read Also :