Diwali Lucky Zodiac Signs | దీపావళి పండుగ నుంచి నాలుగు రోజుల వారికి అదృష్టం కలిసి రాబోతున్నది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగరంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలున్నాయి. దీపావళి పండుగకు ముందు పలు గ్రహాలు తమ స్థానాలు మార్చుకోబోతున్నాయి. దాంతో 12 రాశులవారిపై పండుగలపై ప్రత్యేక ప్రభావం కనిపించనున్నది. కలియుగ ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు ఈ నెల 17న మధ్యాహ్నం 1.36 గంటలకు తులారాశిలో ప్రవేశించనున్నాడు.
ఆ మరుసటి రోజు ధనత్రయోదశి పండుగ రానున్నది. అక్టోబర్ 19న దేవగురువు బృహస్పతి తన రాశి చక్రాన్ని మారనున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12.57 గంటలకు కర్కాటక రాశిలోకి వెళ్లాడు. ఆ తర్వాత చంద్రుడు కన్యారాశిలో నుంచి తులారాశిలోకి వెళ్తాడు. అక్టోబర్ 23న భాయ్దూజ్ పండుగ వస్తున్నది. ఆ తర్వాత 24న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంగారక గ్రహం అక్టోబర్ 27న మధ్యాహ్నం 2.43 గంటలకు వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. ఈ గ్రహాల అరుదైన కలయికతో 12 రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పలు రాశులవారికి అదృష్టం తీసుకురానున్నది. దాంతో ప్రతిరంగంలో ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. శుభవార్తలు వింటారు. అన్నింట్లో విజయం చేకూరుతుంది. దీపావళి పండుగ ఏ రాశులవారికి లక్కీయో తెలుసుకుందాం..!
ఈ సమయం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనం కొనుగోలు సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులపై మంచి రాబడిని పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి ప్రతిపాదనలు తీసుకుంటారు. ఈ సమయంలో ఉద్యోగరంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది.
గ్రహాల సంచారంతో కన్యారాశి వారు మార్పులు చూస్తారు. మీరు ఏ పని చేసినా మీకు ఆర్థికంగా లాభాలుంటాయి. కొత్త వ్యక్తుల నుంచి సైతం మీకు మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ ఉద్యోగంతో పాటు మరికొన్ని పనులు చేస్తారు. దాంతో మీకు ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది.
తులరాశి వారికి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. ఉద్యోగరంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో బంగారం, వెండి ఆభరణాలు లేదంటే వాహనం కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. విదేశీ ప్రయాణం, విదేశీ వ్యాపార సంబంధిత ప్రణాళికల్లో సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఈ సమయంతో మీ అంచనాలు నెరవేరుతాయి. సానుకూల మార్పులు వస్తాయి. సంబంధాల్లో మార్పులు మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. నమ్మకాన్ని పెంచుతాయి. అవివాహితులకు మంచి వివాష ప్రతిపాదనలు వస్తాయి. పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. అన్నిరంగాల్లోని వారికి ఈ సమయం ఉత్తమ ప్రయోజనాలుంటాయి.
Read Also :
Ruchaka Raja Yogam | వృశ్చిక రాశిలోకి కుజుడు.. రుచక రాజయోగంతో ఈ రాశులవారిని వరించనున్న అదృష్టం..!
Guru-Shukra Yogam | గురువు-శుక్రుడి సంయోగంతో.. ఈ మూడు రాశులవారికి అన్నింట్లో విజయాలే..!
Sun-Moon Conjunction | తులారాశిలో సూర్య-చంద్రుల సంయోగం.. ఈ మూడురాశులవారి జాతకమే మారబోతుంది..!