Ruchaka Raja Yogam | దీపావళి పండుగ తర్వాత కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దాంతో రుచక రాజయోగం ఏర్పడనున్నది. ఇది మూడురాశులవారికి అదృష్టం, కీర్తిప్రతిష్టలు, కెరీర్లో వృద్ధిని తీసుకురానున్నది. ఈ అరుదైన యోగం సంపద, గౌరవం, విజయాన్ని ఇస్తుంది. కుజుడు ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అక్టోబర్ 27న తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. ఈ సమయంలో శక్తివంతమైన రుచక రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ యోగాన్ని మహాపురుష రాజయోగంగా పేర్కొంటారు. ఇది ఐదు గొప్ప యోగాలలో ఒకటి. ఏ రాశులవారిని అదృష్టం వరించబోనున్నదో తెలుసుకుందాం..!
మిథునరాశి వారికి ఈ యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. అక్టోబర్‌లో చాలా గ్రహాలు తమ స్థానాలు మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏర్పడనున్న రాజయోగంతో అదృష్టవంతులవుతారు. రుచక రాజయోగంతో మిథునరాశి వారికి ప్రయోజనాలుంటాయి. మీ సంపదకు చెందిన ఇంట్లో హంస రాజయోగం ఏర్పడుతుండగా.. ఏడో ఇంట్లో రుచక రాజయోగం ఏర్పడుతుంది. దాంతో మీరు ఆర్థికంగా లాభాలను పొందే అవకాశం ఉంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఉద్యోగరంగంలో ఉన్న వారికి చాలా శుభపద్రంగా ఉంటుంది. మీ హోదాతో పాటు ప్రతిష్ట సైతం పెరుగుతుంది. కెరీర్లో పురోగతికి అవకాశాలు పెరుగుతాయి.
వృశ్చిక రాశివారికి ఈ యోగం కారణంగా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. లగ్నం ఇంట్లో రుచక రాజయోగం ఏర్పడుతుంది. హంస రాజ్యయోగం ఎనిమిదో ఇంట్లో ఏర్పడుతుంది. తత్ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదలను గమనిస్తారు. ఈ సమయంలో ధైర్యం, శౌర్యం పెరుగుతుంది. ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసే వారు ఈ నెలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
మకర రాశి వారికి అక్టోబర్ నెల చాలా ప్రయోజనకరంగా, శుభప్రదంగా ఉంటుంది. హంస రాజయోగం మీ రాశిలో ఏడో ఇంట్లో, 12వ ఇంట్లో రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ సమయంలో మీరు పనిచేసే చోట లాభంతో పాటు గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగరంగంలో ఉన్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ఈ సమయంలో వివాహం చేసుకోవాలనుకునే వారు ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి.
Read Also :
Guru-Shukra Yogam | గురువు-శుక్రుడి సంయోగంతో.. ఈ మూడు రాశులవారికి అన్నింట్లో విజయాలే..!
Sun-Moon Conjunction | తులారాశిలో సూర్య-చంద్రుల సంయోగం.. ఈ మూడురాశులవారి జాతకమే మారబోతుంది..!
Venus Transit | కన్యారాశిలోకి శుక్రుడు.. ఈ రాశులవారికి డబ్బుకు డబ్బు.. అన్నింట్లో విజయాలే..!