Guru-Shukra Yogam | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన రెండు గ్రహాలు, శుక్రుడు, బృహస్పతి. ఈ రెండు ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఈ ప్రత్యేక సంయోగాన్ని లాభయోగంగా పిలుస్తారు. దీన్ని జ్యోతిషశాస్త్రంలో అదృష్టం, పురోగతి, సానుకూల మార్పుకు చిహ్నంగా భావిస్తారు. శుక్రుడు ప్రేమ, విలాసం, అందాన్ని సూచికగా.. బృహస్పతి జ్ఞానం, సంపదలకు ప్రతీక. ఈ రెండింటి మధ్య సామరస్యం జీవితంలోని అనేక అంశాలపై సానుకూలంగా ప్రభావం ఉంటుంది. ఈ యోగం మూడురాశుల వారికి ముఖ్యంగా ప్రయోజనం చేకూరనున్నది. ఈ రాశుల వారు తమ కెరీర్, వ్యాపారంలోనూ రాణిస్తారు. కుటుంబ సంబంధాలు మరింత బలపడుతాయి. అరుదైన కలయిక కొంతకాలం వారి జీవితాల్లో శుభాలు చేకూరడంతో పాటు విజయం వరించనున్నది. ఈ యోగం ఏ మూడురాశుల వారికి అదృష్టం తేనున్నదో తెలుసుకుందాం..!
ఈ యోగం వృషభ రాశి వారికి చాలా శుభప్రదమైంది. శుక్రుడు పాలక గ్రహం కాబట్టి. శుక్రుడితో సంబంధం ఉన్న పరిస్థితి మీ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ లాభ యోగం ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇది భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలను తీసుకునే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీ ఇమేజ్ పెరుగుతుంది. నమ్మకం మెరుగుపడుతుంది. కెరీర్లో పురోగతికి అవకాశాలు సృష్టిస్తుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా ఉంటుంది. వివాహ జీవితంలో ప్రేమ, అవగాహన పెరుగుతుంది. మీ సంబంధాన్ని మరింత స్నేహపూర్వకంగా చేస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ ప్రణాళికకు మద్దతు ఇస్తారు. మీ మనోధైర్యాన్ని పెరుగుతుంది.
ఈ లాభ యోగం కర్కాటక రాశి వారికి ఒక వరంగా ఉంటుంది. బృహస్పతి కోణం సహజంగానే శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడితో గురువు కలిసిన సమయంలో సానుకూల ప్రభావం మరింత గాఢంగా ఉంటుంది. ఈ కాలంలో కెరీర్లో వేగవంతమైన పురోగతి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ అవకాశాలు పెరుగుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు ఉద్భవిస్తాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. కొత్త సంబంధాలు, భాగస్వామ్యాలతో కూడా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో దీర్ఘకాలిక విభేదాలు, విభేదాలు పరిష్కరించే అవకాశం ఉంది. పరస్పర అవగాహన, స్నేహపూర్వక ప్రవర్తన సంబంధాలను మరింతగా పెంచుతాయి. తల్లిదండ్రులు, పెద్దలతో సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఈ కలయిక ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన అనేక పనులు మళ్లీ ఊపందుకుంటాయి. బృహస్పతి, శుక్రుడి సంయోగంతో ఏర్పడిన లాభయోగంతో ఈ అంశం కెరీర్ను ఉన్నతీకరించడానికి సహాయపడుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే.. ఇది అనుకూలమైన సమయం. గ్రహ స్థానాలు మారుతున్నాయి. ఇది మీ సామర్థ్యాలను, ఖ్యాతిని పెంచుకోగలుగుతారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు నాయకత్వ అవకాశాలు దక్కించుకుంటారు. విదేశీ ప్రయాణం, విదేశీ వాణిజ్యం కోసం ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. కుటుంబం, వైవాహిక జీవితంలో సానుకూల అంశాలుంటాయి. పాత వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. ప్రేమను తిరిగి పొందుతారు. సామరస్యం, నమ్మకం బలపడుతున్నది.
Read Also :
Sun-Moon Conjunction | తులారాశిలో సూర్య-చంద్రుల సంయోగం.. ఈ మూడురాశులవారి జాతకమే మారబోతుంది..!
Venus Transit | కన్యారాశిలోకి శుక్రుడు.. ఈ రాశులవారికి డబ్బుకు డబ్బు.. అన్నింట్లో విజయాలే..!