Navapanchama Raja Yogam | వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మార్చుకుంటాయి. ఈ క్రమంలో అనే శుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రభావం 12రాశి చక్రాలపై కనిపిస్తుంది. ఈ దీపావళి రోజున నవ పంచమ రాజయోగం ఏర్పడనున్నది. శుక్రుడు కన్యారాశిలో, యురేనస్ వృషభ రాశిలో ఉంటాడు. దాంతో పలు రాశులవారి జాతకంలో మార్పులు కనిపించనున్నాయి. పలువురు రాశులవారికి అదృష్టం పట్టబోతున్నది. ఆ రాశులేంటో ఓసారి తెలుసుకుందాం..!
నవ పంచమ రాజయోగం కుంభరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు మీ రాశి నుంచి ఎనిమిదవ ఇంట్లో సంచరించనున్నాడు. కుంభరాశి జాతకంలోని నాల్గవ, తొమ్మిదవ ఇండ్లకు శుక్రుడు అధిపతి. శుక్రడి సంచారంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు కెరీర్, వ్యాపారంలో కొత్త శిఖరాలను చేరుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయి.
నవ పంచమ రాజయోగం మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు మీ రాశిలోని నాల్గవ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ సమయంలో భౌతిక సుఖాలు పెరుగుతాయి. వాహనం, ఆస్తిని కొనాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరిగే అవకాశాలున్నాయి. మీ పనికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది.
శుక్రుడి సంచారం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. నవ పంచమ రాజయోగం మీ రాశిలో సంపద సంబంధించి ఇంట్లో ఏర్పడుతున్నది. దాంతో మీకు ఆస్మిక ధనలాభంతో పాటు కెరియర్లో కొత్త అవకాశాలుంటాయి. ఈ సమయంలో పదోన్నతికి కూడా అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమస్యలు దూరమవుతాయి.
Read Also :